TRINETHRAM NEWS

Trinethram News : అమెరికా పోలీసులు బదర్‌ ఖాన్‌ సూరి అనే భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హమాస్‌ ఉగ్రవాదులతో అతడికి సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ అరెస్టు చేసినట్లు సమాచారం.

వాషింగ్టన్‌ డీసీలోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్ చేస్తున్నారు. యూనివర్సిటీలో సూరి… హమాస్‌ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ లోని అసిస్టెంట్‌ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్‌ ఆరోపించారు.

అంతేకాక.. ఉగ్రవాద సంస్థలోని పలువురితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీంతో అతడి వీసాను రద్దు చేసినట్లు తెలిపారు. ఈక్రమంలోనే ఫెడరల్‌ ఏజెంట్లు సోమవారం వర్జీనియాలోని అతడి ఇంటి వెలుపల అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

అయితే, తన అరెస్టుపై సూరి ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్‌ చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, తన భార్యకు పాలస్తీనా మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indian student's arrest in