జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 28 త్రినేత్రం న్యూస్. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా దేవరకొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని, అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఎనలేనిదని అన్నారు.
జాతీయ ఉపాధి హామీ చట్టం పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలి అని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు యునూస్, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు వేణుధర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, నజీర్ అహ్మద్, సురేష్ గౌడ్, రహత్ అలీ, రైస్, పున్నబోయిన సైదులు, గోవింద్ యాదవ్,తుల్చా నాయక్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, సర్పంచులు కొర్ర రాంసింగ్ నాయక్,బాబు రామ్,ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress Party Foundation Day Celebrations

You cannot copy content of this page