MLA Balu Naik : ముంపు ప్రాంతాలను పరిశీలించిన దేవరకొండ ఎం ఎల్ ఏ బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 30 త్రినేత్రం న్యూస్. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర ముప్పును ఎదుర్కొన్న చింతపల్లి మండలంలోని ఉప్పరపల్లి గ్రామాన్ని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ప్రత్యక్షంగా సందర్శించారు. ముంపు ప్రాంతాలను జిల్లా అధికారులతో కలిసి పర్యటించి, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలోని రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలు అంతరాయం కలిగిన విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే బాలునాయక్ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తదనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన…ఉప్పరపల్లి గ్రామానికి నాలువైపులా రోడ్లు దెబ్బతినడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రూ. 6 కోట్ల రూపాయల వ్యయంతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సమన్వయం చేసి గ్రామానికి కావాల్సిన రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా నాంపల్లికి వెళ్ళే దారిలో లో లెవల్ కల్వర్ట్ నిర్మాణానికి కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలు, ముఖ్యంగా రైతులు, ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాల్లో నీటి ముప్పు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలివేలు సంజీవరెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునా మాధవరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, ఆర్డీవో రమణా రెడ్డి, ఎంపీడీవో సుజాత, ఎమ్మార్వో రమాకాంత్ శర్మ, తదితర అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Balu Naik inspects the flooded areas

You cannot copy content of this page

Scroll to Top