Sarpanch Sekhar Reddy : భారత రాజ్యాంగంప్రపంచానికే ఆదర్శం

TRINETHRAM NEWS

చింతపల్లి జనవరి 26 త్రినేత్రం న్యూస్. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.సోమవారం
77 వ గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా తీదేడు గ్రామ పంచాయతీ కార్యాలయం,అంగన్వాడి కార్యాలయాలు,మండల పరిషత్ పాఠశాల మరియు జిల్లా పరిషత్ పాఠశాలలలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ గ్రామ ప్రజలందరికి 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించింది వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం మనందరికి గర్వకారణమన్నారు.రాజ్యంగం మన భారత దేశానికి అత్యున్నత చట్టం,మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమన్నారు.డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మన రాజ్యాంగం పితామహుడని మనం ఎల్లప్పుడూ మన రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు.

నేను భారతధేశ పౌరురాలిగా గర్వపడుతున్నాను.మన పాఠశాల అభివృద్ధి కోసం నా శాయశక్తులా పనిచేస్తానని హామి ఇస్తున్నాను.మన పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని దయచేసి చదువును కష్టంతో కాకుండా ఇష్టం చదవాలని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ఇడబోయిన వెంకటయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు,ఉలుపాల శేఖర్ రెడ్డి,సోనగంటి గొవర్థనాచారి,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్,సందె లక్ష్మయ్య, మర్ల యాదగిరి యాదవ్, శివర్ల పర్వతాలు‌ యాదవ్,ప్రధానోపాధ్యాయులు గడ్డంసురెందర్,సత్తయ్య,మాజీ సర్పంచ్లు,మాజీఉపసర్పంచ్లు,గ్రామ పెద్దలు,మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indian Constitution is a model for the world.

You cannot copy content of this page

Scroll to Top