తేదీ : 16/09/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ యోగ సభ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయపు నడక మిత్రమండలి ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకి శెట్టి. బాలాజీ మాట్లాడుతూ యాభై సంవత్సరాలు వయసు దాటిన వాళ్లు అనారోగ్యంతో ఉన్నవాళ్లు, వీలునామాన్ని వ్రాసి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే భవిష్యత్తులో కుటుంబ సభ్యుల మధ్య ఏ విధమైన లిటిగేషన్ రాదని తెలియజేశారు. వీలునామా అనేది మనిషి తనంతరమే అమలులోకి వస్తుందని, జీవితంలో చివరిసారిగా వ్రాసిన వీలునామా కే విలువ ఉంటుందని అన్నారు. కనీసం ఇద్దరు ఇద్దరు సాక్షులు ఉండాలని, సేవాధికార సంస్థ కొన్ని వందల కేసులు పరిష్కరిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతుందని సూచించారు. ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై తనకు తెలిసిన రీతిలో తెలియపరిచారు.
అదేవిధంగా న్యాయమూర్తి రామకృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి పౌరుడు చట్టాల పట్ల కనీస అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. నేడు మారుతున్న కాల పరిస్థితులు కు అనుగుణంగా తల్లిదండ్రుల సంరక్షణ కోసం , వయోవృద్ధుల సంరక్షణ మనోవర్తి, చట్టం అమల్లోకి వచ్చిందని, అతి తక్కువ కాలంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన పిల్లలపై చట్ట ప్రకారం తగిన పరిహారం పొందవచ్చని చెప్పడం జరిగింది. పిటిషన్ ఆర్డీవో కార్యాలయంలో ఏ విధమైన కోర్టు ఫీజు లేకుండా దాఖలు చేయవచ్చని తెలియపరిచారు. ఈ సంస్థ ప్రజలకు మాత్రమే న్యాయం అందించడం కోసం నిరంతర కృషి చేస్తుందని అన్నారు. ఈనెల అనగా సెప్టెంబరు పదమూడు న జాతీయ అదాలతో జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు పదహారు వేల కేసులు పరిష్కరించినట్లు, బాలికల సంరక్షణ కోసం పోక్స చట్టం అమల్లోకి వచ్చిందని , ప్రపంచానికే యోగ తెలియజేసింది , గర్వకారణం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యోగా సభ గురువులు, గురునాథ్ బాబు, చింతయ్య, ఆర్ డి. ప్రసాద్, కోక. మహేష్, న్యాయవాది మద్దాల. సువర్ణ రాజు, పలువురు యోగసభ్యులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


