Trinethram News : నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని వర్చువల్ గా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కార్యకర్తలు కార్యాలయాలు కార్యక్రమాలు అనే మూడు కూడా రాజకీయ పార్టీకి గుండెకాయ లాంటిదని, కార్యాలయాలు అనేవి కార్యకర్తలు కలవాలన్న, లేదా నాయకులతో కార్యకర్తలు ఏమన్నా చెప్పాలన్న, ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయాలన్న కార్యాలయాలు అన్నవి చాలా ప్రధానం అని, మనం ఈరోజు నుంచి ఎన్నికల నగర మోగించామని, కార్యకర్తలను నిర్దేశిస్తూ మీరంతా పార్టీకి గుండె చప్పులు అని ఆమె అన్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే విభిన్నమైన పార్టీ అని కార్యకర్తలు కష్టాన్ని గుర్తించి గౌరవిస్తుంది .అని ఆమె అన్నారు కష్టపడి పని చేసే కార్యకర్తకి ఎప్పుడు పెద్దపేట వేస్తుందని, 2014 ముందు టీవీ ఆన్ చేస్తే ప్రతిరోజు ఏదో ఒక స్కాం బయటపడేదని 2014 తర్వాత స్కీములు వెలువెడు తున్నాయని అన్నారు. భాజపా అధికారంలో వచ్చినప్పటి నుండి నేటి వరకు అవినీతికి తావులేనటువంటి పాలన సమర్థత కూడినటువంటి పాలనతో పాటుగా సమాజంలో ఉన్న ప్రతి వర్గం వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేసింది అనే విషయాన్ని గమనించాలని, రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమని, వికీసితి భారత్ సంకల్పయాత్ర ద్వారా అధికారులు ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు విశ్లేషించి చెప్పటం వలన ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందని ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం స్టిక్కర్లు అంటించుకుంటూ స్టిక్కర్ ప్రభుత్వాలుగా మిగిలిపోతున్నాయంటూ ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శీపా వంశీధర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ,రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి, ఎస్సీ రాష్ట్ర మోర్చా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు, పి నారాయణ రెడ్డి నరసింహనాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శిలు కాలం బుజ్జి రెడ్డి, రాజేష్, యశ్వంత్, ఓబీసీ మోర్చా జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, జిల్లా కార్యదర్శిలు దాసరి ప్రసాద్ చిలకా ప్రవీణ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి గంజిం పెంచల ప్రసాద్ ,నియోజకవర్గపు ఇన్చార్జిలు, మీడతల రమేష్ ఈశ్వరయ్య, ఇండ్ల రఘురామయ్య, మల్లికార్జున్ రెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు కరణం సుభాషిని, అశోక్ నాయుడు, యకసిరి ఫణిరాజు, ప్రసాద్, సోషల్ మీడియా కో కన్వీనర్ పిడుగు లోకేష్ ,బిజెపి సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
నెల్లూరు పార్లమెంట్ బిజెపి ఎన్నికల కార్యాలయం ప్రారంభం
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…