జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 01 at 7.59.47 PM

TRINETHRAM NEWS

అడుగడుగునా బ్రహ్మరధం పట్టిన ఎం.వి రాజు పాలెం ప్రజలు

వేగేశన నరేంద్ర వర్మ

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణం27వార్డు మరియు కర్లపాలెం మండలం ఎం.వి రాజు పాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి వెళ్లి టిడిపి, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో ను మహిళామణులకు వివరించారు.అనంతరం తన గురించి వివరించే పుస్తకం మరియు చీర, చేతి సంచి ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ..

తెలుగుదేశం పార్టీ జాతీయ అధక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలసి బాపట్ల నియోజకవర్గం లో జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా బీఫారం నాకు ఇవ్వబోతున్నారు

బాపట్ల నియోజకవర్గములో ఈ సారి జనసేన, టిడిపి సంకీర్ణ ద్వారా గెలవబోతున్నాము

తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి గా ముందుకు వెళుతున్న ప్రజలు అందరూ ఆశీర్వదిస్తున్నారు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకంతో ఏడాదికి 15 వేల రూపాయలు తల్లి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పూర్ టూ రిచ్ పథకం ద్వారా పేదలను రిచ్ గా చేసేందుకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు

ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page