త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 12 :నెల్లూరు జిల్లా :కొండ బిట్రగుంట.. కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ట్రస్ట్ బోర్డు సభ్యులు మంగళవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిశారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి అందరూ సమిష్టిగా సహకరించాలని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కమిటీ చురుకుగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


