అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 16 : జనసేన పార్టీ ఇంచార్జి పాడేరు, మరియు అరకు పార్లమెంట్, వంపూరు గంగులయ్య మాట్లాడుతూ నిన్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరిగిన జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ కి రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన జనసేన కుటుంబ సభ్యులు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అరకు పార్లమెంట్ పరిధిలో నుంచి హాజరైన గిరిజన ఏడు నియోజక వర్గాలకు జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహించే నాయకులు, జనసైనికులు,వీర మహిళలు కి అభినందనలు తెలుపుతున్నాం.
రాష్ట్ర రాజకీయాలలో ఎన్నో విమర్శలకు, అవహేళనలకు గురై మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ నవతరం రాజకీయాల్లోకి ఒక దార్శనికత కలిగిన రాజకీయ మార్పుకి అధ్యుడయ్యారు మన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ .ఉదాహరణకు మన ప్రాంతాలని పరిశీలిస్తే అతనిచ్చినా ధైర్యంతో నేటి యువ నాయకులు రాజకీయాలలో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నారు.నవతరం రాజకీయాల్లోకి యువతే ప్రధాన కార్యదక్షత కలిగి వుండాలనేది అతని ఆకాంక్ష.
ఒక తరం నాయకత్వాన్ని అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆదేశాలు ఆచరిస్తూ భవిష్యత్ తరాలకు నిజాయితీ కలిగిన నాయకత్వం అందించడం తద్వారా దేశ హితం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ట పరస్తూ అత్యుత్తమ నాయకులు గా నేటి యువతను తీర్చిదిద్దడమే అతని లక్ష్యం. పాడేరు నియోజకవర్గం నుంచి నాయకులుగా మీరందరూ భవిష్యత్ తరాలకు గిరిజన ప్రజలకు హితమైన రాజకీయాలకు ఆధ్యులు కావాలి.. రాష్ట్ర రాజకీయాలే ప్రధాన ఆలోచన విధానం తో పాటుగా దేశ స్థానిక గిరిజన శ్రేయస్సు కూడా ముఖ్యమం అనే విధానం మరిచిపోరాదనేది మా ఆకాంక్ష.
ఈ రోజు మా నాయకత్వంలో ఏమి పదవులు స్వీకరించమనేది ప్రదానం కాదు ఎటువంటి ఆలోచన విధానంతో కూడిన నాయకత్వం గిరిజన ప్రజలకు అందించమనేదే మా ప్రధాన లక్ష్యంగా మేము భావిస్తాము. మీకు ఇప్పటికే మన అధినేత దేశానికి కావలిసిన నాయకుడనే ఆలోచన కలిగివుంటుంది. సగటు జనసేన పార్టీ నాయకుడు పరిపక్వత సమాజహితం కోసం అచంచల విశ్వాసంతో, శక్తితో, ఆత్మస్థైర్యంతో, నిండివుంటుందనే యాదర్ధాన్ని మరిచి పోరాదని ఈ సందర్భంగా యువత నుంచి మేము ఆశిస్తున్నాము గంగులయ్య తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


