Distribution of Aids : 122 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయ ఉపకరణాల పంపిణీ విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శారద

TRINETHRAM NEWS

పెద్దపల్లి, మార్చి-15// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల 122 మంది పిల్లలకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగిందని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శారద తెలిపారు శనివారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అలింకో సంస్థ, విద్యాశాఖ సంయుక్తంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శారద మాట్లాడుతూ, 122మంది అర్హత కల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వివిధ రకాల సహాయ ఉపకరణాలు అందించడం జరిగిందని అన్నారు.సహాయ ఉపకరణలలో వీల్ చైర్లు, ట్రై సైకిల్లు, చెవిటి మిషన్లు రోలాటర్, టి.ఎల్.ఎమ్ కిట్లు మొదలైన ఉపకరణాలు ఉన్నాయని తెలిపారు
ఈకార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష జిల్లా ఐఈ కోఆర్డినేటర్ లు కవిత ఎండి అజీమ్ మండల విద్యాధికారి రాజయ్య గర్రేపల్లి ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత, అన్ని మండలాల సమగ్ర శిక్ష ప్రత్యేక ఉపాధ్యాయులు, ఉపకరణాలు పొందిన విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of aids

You cannot copy content of this page

Scroll to Top