రాజకీయ రసాయన శాస్త్రజ్ఞుడు కాన్సిరాం జయంతి ఘనంగా బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసిన నాయకులు కాన్సిరాం బహుజనులకు చేసిన సేవలను కొనియాడారు, అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వర్గాల అభ్యున్నతే నా లక్ష్యం అని సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడు కాన్షిరాం అన్నారు భారత దేశ రాజకీయాల్లో ఒక సామాన్యుడు సైకిల్ పై బయలుదేరి విజయతీరాన్ని చేరుకున్నాడన్నారు చరిత్ర మరిచిన బహుజన మహనీయులందరినీ భారతదేశానికి, ప్రపంచానికి పరిచయం చేసింది కాన్షిరామన్నారు
భారత రాజకీయాల్లో రాజకీయ రసాయన శాస్త్రజ్ఞుడు కాన్సిరాం అని కొనియాడారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, వారి ఆశయ సాధన తో పార్టీని జిల్లాలో గ్రామ గ్రామానికి తీసుకువెళ్తామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష్యాన్ని చేరుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమం చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, మంచిర్యాల పట్టణ నాయకులు మడిపల్లి రాములు, జిల్లా నాయకులు చెన్నూరి రాజు, కుమ్మరి కృష్ణ చైతన్య, సుందిళ్ల అశోక్, బేడ్డల రవి, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


