in many districts of the state it will be raining for another four days
Trinethram News : తెలంగాణ : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో అధికారులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని…ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. మంగళవారం నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్,ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App