డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 22 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో మంగళవారం నాడు పీఎం శ్రీ లో భాగంగా ఆన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డీ నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ప్రాముఖ్యత, చదువు యొక్క ఆవశ్యకతను మంచిగా చదువుకొని ఉన్నతరంగాలలో రాణించాలని ఆయన అన్నారు.
ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగ స్థాయిలో డాక్టర్లుగా లెక్చరర్లుగా ఐఐటి కాలేజీలలో ఉన్నత చదువులు చదువుకొని మంచి రంగాలలో రాణించినారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డీ నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యామ్, శ్రీలత, రమ, సుశీల, బిచ్చయ్యా, ఎన్ విజయ్, సోమయ్య, చెన్నయ్య, రవి, బాలకృష్ణ, విజయ్, రాజు, రమేష్, శ్రీను, శ్రీలత, రూమ్షా, జ్యోతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


