Heavy Rains : తెలంగాణలో నేటి నుంచి ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురవనున్నాయి

TRINETHRAM NEWS

Telangana will receive heavy rains from today till day after tomorrow

Trinethram News : Aug 22, 2024,

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎల్లుండి (ఆగస్టు 24) వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇవాళ పూరీ, చిలుకా లేక్ మధ్య తీరాన్ని దాటడంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. కాగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana will receive heavy rains from today till day after tomorrow

You cannot copy content of this page

Scroll to Top