మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
- అల్లిమెట్టలో యదేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు
- ఎమ్మెల్యే అండతో అర్ధరాత్రులు మట్టి తరలింపు
- ప్రభుత్వ సొత్తు దోపిడీకి నిలువెత్తు నిదర్శనం
- రోడ్లు, డ్రైన్లు పూర్తిగా ధ్వంసం
- రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, మౌనం ఎందుకు?
త్రినేత్రం న్యూస్, అనపర్తి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆరోపించారు.
అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో ఆయన అనుచరులు యదేచ్చగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇప్పటికే బిక్కవోలు మండలం రంగాపురం, బిక్కవోలు గ్రామాలు, రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామ పరిధిలో అక్రమంగా మట్టిని తరలించారు, తాజాగా పాత వీరంపాలెం గ్రామానికి చెందిన అల్లిమెట్ట ప్రాంతంలో కొత్తగా అక్రమ మైనింగ్‌కు తెరతీశారని తెలిపారు.
సుమారు 20 అడుగుల లోతుకు మట్టిని తవ్వి అర్ధరాత్రులు దొంగతనంగా తరలించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొత్తును ఈ విధంగా దోచుకోవడంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రథమ ముద్దాయి అని విమర్శించారు.
అక్రమంగా మట్టిని తరలించడం వల్ల రోడ్లు, డ్రైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఎమ్మెల్యే తన అనుచరుల సహకారంతో అక్రమ మైనింగ్ ద్వారా ఎన్ని కోట్లు దోచుకున్నాడో చెప్పేందుకు అల్లిమెట్ట ప్రాంతమే నిదర్శనమని పేర్కొన్నారు.
ఇంత జరుగుతున్నా రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి,కి ఈ అవినీతి కనిపించడంలేదా? లేక ఎమ్మెల్యే ముడుపులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చింది ప్రజాసేవ కోసం తప్ప ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడానికి కాదని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ అవినీతి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


