Illegal Mining : నల్లమిల్లి చెరువు మట్టి అక్రమ రవాణా… గ్రామస్తుల ప్రాణాలకు, ముప్పు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి, నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2014–19 కాలంలో కోట్లాది రూపాయల మట్టిని చెరువుల నుంచి తవ్వి విక్రయించి ప్రజాధనాన్ని దోచుకున్న అనపర్తి శాసనసభ్యుడు, రామకృష్ణారెడ్డి,ఇప్పుడు మళ్లీ అదే పాత మార్గానకే మళ్ళాడు.

రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలోని జగన్నాథసాగరం చెరువు లోతుగా తవ్వి, బిక్కవోలు మండలం పందలపాకలోని ప్రైవేట్ లేఅవుట్‌కి మట్టిని తరలిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం గ్రామ రైతులకు చెరువుల్లోని మట్టిని తమ పొలాల పటిష్టానికి ఉపయోగించేందుకు పర్మిషన్ ఇస్తుంది. కానీ ఈ నిబంధనను దుర్వినియోగం చేసి, పదిరోజులుగా 12 నుంచి 13 అడుగుల లోతులో చెరువును తవ్వుతున్నారు.

వర్షం పడిన సందర్భంలో చెరువు గండి పడే ప్రమాదం ఉందని, నల్లమిల్లి గ్రామం మొత్తం ముంచే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుకూలతతోనే జరుగుతోంది. గతంలో కూడా కాపవరం గ్రామంలో ఇలాగే తవ్వకాలు జరగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

“డబ్బు సంపాదన కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టవద్దు” అని, రామకృష్ణారెడ్డి కి అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, హెచ్చరించారు. నీకు డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే చాలా మార్గాలు,వ్యాపారాలు ఉన్నాయి అవే చూసుకో.. అంతే కానీ ప్రజల ప్రాణాలను అడ్డుపెట్టి డబ్బు సంపాదించాలని చూడకు. నీ కుక్క బుద్ధిని ఇప్పటికీ అయ్యిన మార్చుకో, రామకృష్ణారెడ్డి.

మా ప్రభుత్వ హయాంలో నేను ఎటువంటి తప్పు చెయ్యకపోయినా, నేను చెయ్యని తప్పుకి కూడా నన్ను రకరకాల పేర్లతో పిలిచేవాడివి. నువ్వు గ్రావెల్,మట్టి తినే అడ్డగాడిదవి. గాడిద అయ్యిన సరే గడ్డి తింటుంది.నువ్వు మాత్రం సిగ్గు లేకుండా గ్రావెల్,మట్టి తింటున్నావు.ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు.

పది రోజుల నుంచి నీ దృష్టికి రాలేదా.అధికారులు ఎవరూ చెప్పలేదా.మీ పార్టీ నాయకులు చెప్పలేదా.మాట్లాడితే సిగ్గు లేకుండా నాకు తెలియదు అని చెప్తావు.ఏదో మైక్ పట్టుకుని, కబుర్లు చెప్పటం, కాదు.ఒకసారి ఇక్కడికి వచ్చి చూడు.ఇక్కడే కాదు ఇంకా రెండు చెరువులలో కూడా అలానే తవ్వుతున్నారు అని తెలిసింది….అక్కడికి కూడా నేను వెళ్ళి నిజాలు ప్రజలకి తెలియచేస్తాను..

ఈ మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,తో పాటు సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మండల ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి వెంకటేశ్వరావు,మండల కన్వీనర్ నల్ల శ్రీనివాస్,సింగంపల్లి సర్పంచ్ పుట్ట శివశంకర్ ఆనంద్,నల్లమిల్లి సర్పంచ్ దుర్గాప్రసాద్,మండల వైస్ ఎంపీపీ మాట శ్రీను,నల్లమిల్లి గ్రామ కన్వీనర్ కొండేపూడి చిన్న,నల్లమిల్లి వార్డు మెంబర్ వీరబాబు,కుటుంబరావు, ప్రగిరెడ్డి గౌరీ శంకర్,సింగంపల్లి ఉప సర్పంచ్ సోమిశెట్టి అప్పారావు, నల్లమిల్లి ఉప సర్పంచ్ కంచమర్తి సాయిబాబు,మామిడాల సూరిబాబు, వీరబాబు,దుర్గారావు, మట్ట ప్రసాద్, మాగాపు దొరబాబు, బుద్ధ రాజు,రాముడు,దొరబాబు తదితరులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Illegal mining of soil

You cannot copy content of this page

Scroll to Top