జూలై 16, 2026
TRINETHRAM NEWS
Iftar feasts enhance the bond

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందునేనావత్ బాలు నాయక్ .

Iftar Feasts : దేవరకొండ డివిజన్ మార్చ్ 15, త్రినేత్రం న్యూస్. రంజాన్ పండుగ సందర్బంగా దేవరకొండ పట్టణంలోని డిండి క్రాస్ రోడ్,మక్కా మజ్జిద్ లో ముస్లిం మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనాలు నిర్వహించి, అడ్వాన్స్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ శాసన సభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతికగా నిలుస్తాయని, గంగా,జమున, తహజీప్ కు ప్రతిరూపంగా మారుతాయని ఎమ్మెల్యే అన్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో నియమ నిష్ఠతో ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిం సోదరులు ఉపవాసాలు పాటిస్తున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రంజాన్ పండుగ ప్రతి ముస్లిం ఇంట్లో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,సీనియర్ నాయకులు హన్మంతు వెంకటేష్ గౌడ్, తాహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్లు,ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page