జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 24 at 12.47.44

TRINETHRAM NEWS

-22వ వార్డు పర్యటనలో ఎంపీ భరత్

రాజమండ్రి, ఫిబ్రవరి 24: రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మీ ఇంటి పెద్ద కొడుకునై అన్నిటా నేనుంటానని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ నగర వాసులకు మాటిచ్చారు. శనివారం నగరంలోని 22వ వార్డు గోదావరి బండ్ రోడ్డు, కంభం వారి సత్రం వీధి నుంచి నిర్వహించిన వార్డు పర్యటనలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వీధులలో ఆయన ఇంటింటికీ వెళ్ళి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. ‌రాజమండ్రి నగరం అభివృద్ధి చెందిందా లేదా అని ప్రశ్నించారు. ఎంపీగా మీరొచ్చిన తరువాత నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, ఎమ్మెల్యేగా మీరే గెలవాలని..మా ఓటు మీకేనంటూ ఆ వార్డు ప్రజలు ఎంపీకి చేతిలో చేయివేసి మరీ మాటిచ్చారు. ఒక మహిళ అయితే.. ఎంపీ సార్..మీరు చేసిన సహకారం జీవితంలో మరిచిపోలేనని కన్నీరు పెట్టుకుంది. మా అబ్బాయి పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టాడని..ప్రభుత్వ హాస్పిటల్, మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్ళినా సర్టిఫికేట్ ఇవ్వలేదని, అటువంటిది జగనన్న పాలన వచ్చాక మిమ్మల్ని కలిశాక సర్టిఫికేట్ వచ్చింది.. నెలలోపే పెన్షన్ కూడా శాంక్షన్ అయిందని ఎంతో ఆనందంగా చెప్పింది. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. మరికొందరైతే ఎంపీతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. మా కుటుంబం మొత్తమే కాదు సార్..ఈ వీధి మొత్తం మీ అభిమానులమే అంటూ గుమ్మం గుమ్మంలోనూ హారతులు పట్టారు. నుదుటన విజయ తిలకం దిద్ది..మీరు తప్పనిసరిగా గెలుస్తారు.. మంత్రి అవుతారని మహిళలు నిండు మనసుతో ఆశీర్వదించారు. ‌ఒకచోట అయితే.. వీధి వీదంతా మహిళలు, పిల్లలు, పెద్దలతో సహా ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, క్లస్టర్ ఇంచార్జ్ అజ్జరపు వాసు, వార్డు ఇన్చార్జి దొరవాసుల సత్యనారాయణ, కొత్త బాల మురళీకృష్ణ, కొత్త విజయ రాజ్యలక్ష్మి, కేదర్శెట్టి గోవింద్, జీ రామకృష్ణ, యన్ నాగదత్త, యన్ బాబు వార్డు ప్రముఖులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You cannot copy content of this page