TRINETHRAM NEWS

శ్రీరాంపూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మిగతా క్లెయిమ్ లను సెటిల్మెంట్ చేయడం లో నిర్లక్ష్యం గా వ్వవహరిస్తున్న యాజమాన్యం, సిఎంపిఎఫ్ అధికారులు.

ఒక్క ఏరియా లోనే ఇలా ఉంటే మిగతా పది ఏరియాల రిటైర్డ్ కార్మికుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

యుద్ద ప్రాతిపదికన పదకోండవ వేజ్ బోర్డు లో రిటైర్డ్ ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ లను తక్షణమే సెటిల్మెంట్ చేయాలి.

సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి వేణు మాధవ్ డిమాండ్.
సింగరేణి, శ్రీరాంపూర్ ఏరియాలో సమాచార హక్కు చట్టం 2005 కింద సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 11వ వేతన ఒప్పందం ప్రకారము రివైజ్డ్ పెన్షన్ క్లైముల వివరాలను అడగడం జరిగిందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అళవందార్ వేణు మాధవ్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

శ్రీరాంపూర్ ఏరియా సమాచార హక్కు చట్టం కింద వేణుమాధవ్ కు సంబంధిత సింగరేణి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐ ఈ డి ) అధికారి సమాధానం పంపించారని ఆయన తెలిపారు. ఆర్టీఐ కింద శ్రీరాంపూర్ ఏరియా అధికారుల ఇచ్చిన వివరాల ప్రకారం శ్రీ రాంపూర్ ఏరియాలో మొత్తం 2106 మంది కార్మికులు పదవి విరమణ చేయగా, అందులో 1138 రిటైర్డ్ కార్మికుల రివైజ్డ్ పెన్షన్ క్లెయిమ్స్ వివరాలను గోదావరిఖనిలోని కోల్ మైన్స్ ప్రావిడెంట్ పండ్ కార్యాలయ రీజినల్ కమిషనర్ కు పంపించడం జరిగిందని, అందులో 83 మందికి రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు కాపీలు గోదావరిఖని సీఎం పిఎఫ్ ఆఫీసు నుంచి పంపించారని సమాచారం ఇచ్చినట్లు ఏ వేణుమాధవ్ తెలిపారు.

19, ఫిబ్రవరి,2025 వరకు సింగరేణి వద్ద ఉన్న సమాచారం ప్రకారం శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం 11 వ వేజ్ బోర్డు కింద 2106 టైర్డ్ కార్మికులకు గాను 1238 రిటైర్డ్ కార్మికుల పెరిగిన వేతనాల ప్రకారం పెరిగిన పెన్షన్ క్లెయిమ్స్ లను గోదావరిఖని సీఎం పిఎఫ్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేయడం జరిగిందని ఇంకా 968 రిటైర్డ్ కార్మికుల వివరాలను సీఎం పిఎఫ్ కార్యాలయానికి పంపించవలసి ఉన్నదని ఆయన అన్నారు. రిటైర్డ్ కార్మికులు వారు పనిచేసిన గని లేదా డిపార్ట్మెంట్ వద్దకు వెళ్ళి వారి వివరాలు అందించాల్సి ఉండగా ఇవ్వడం లేదని సమాచార హక్కు చట్టం కింద తనకు సమాధానం ఇచ్చినట్లు వేణుమాధవ్ తెలిపారు.

సింగరేణి యాజమాన్యం తరఫున 1138 క్లెయిమ్ లను సెటిల్మెంట్ కోసం పంపిస్తే కేవలం 83 మాత్రమే సెటిల్ కావడం వెనక కారణాలు ఏమిటన్న విషయాలు సింగరేణి యాజమాన్యం బాధ్యత కాదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే 968 మంది రిటైర్మెంట్ కార్మికులు రావడం లేదని అధికారులు చెబుతున్నారని ఇది సరైన సమాధానం కాదని ఆయన అధికారుల పై మండి పడ్డారు, వారికి సింగరేణి యాజమాన్యం తరపున రివైజ్డ్ పెన్షన్ సెటిల్మెంట్ కోసం సంబంధిత కాగితాలు అందించాలని గనులు లేదా డిపార్ట్మెంట్ల వద్ద ఆ మాజీ కార్మికుల వివరాలను నోటీసు బోర్డుల వద్ద అంటించడమే కాకుండా, వారి మొబైల్ లకు సమాచారం ఇచ్చారా అనే విషయాలు సంబంధిత అధికారులు తెలియపరచి ఉండాల్సిందని ఆయన అన్నారు.

కేవలం రిటైర్మెంట్ కార్మికుల లిస్టు వారి దగ్గర పెట్టుకొని వారికి సమాచారం ఇవ్వకుండా పెండింగ్ స్టేటస్ చూపెడితె ఫలితం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను దరఖాస్తు చేసిన సమాచార హక్కు చట్టంకు సమాధానం పంపించినందుకు శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని , ఇప్పటికైనా సిఎంపిఎఫ్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న క్లెయిమ్ లను త్వరగా సెటిల్మెంట్ అయ్యే విధంగా సిఎంపిఎఫ్ అధికారుల తో చర్చలు జరపాలని, అదేవిధంగా మిగిలిన 968 మంది కి క్లెయిమ్ లను పెట్టుకోవడానికి సమాచారం అందించాలని త్వరగా ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో ఒక్క శ్రీరాంపూర్ ఏరియా విషయం లో ఇలా ఉంటే మిగతా ఏరియాలో కూడా 11వ వేజ్ బోర్డులో పదవి విరమణ పొందిన మాజీ కార్మికుల పరిస్థితి ఏమిటో తేట తెల్లమవుతున్నదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ముఖ్యంగా నీయులు సింగరేణి సిఎండి బలరాం గారు ఈ విషయాలను యుద్ధ ప్రాతిపదికగా పరిశీలించి మాజీ కార్మికులకు రావాల్సిన రివైజ్డ్ పెన్షన్, వాటి బకాయిలను త్వరగా ఇప్పించాలని, ఆర్థిక బాధల నుంచి వారిని కాపాడాలని ఆయన ఒక ప్రకటన లో కోరారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App