Thota Trimurthulu : పార్టీ బలోపేతానికి కలిసి కృషి చేద్దాం

TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జిల్లా అధ్యక్ష హోదాలో మండపేట చేరుకున్న జగ్గిరెడ్డికి తోట ఆధ్వర్యంలో ఘన స్వాగతం…

మండపేట : త్రినేత్రం న్యూస్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేద్దాం అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డిని ఎంపిక చేయడం సంతోషకరం అన్నారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును మర్యాదపూర్వకంగా పార్టీ కార్యాలయంలో కలిశారు. జగ్గిరెడ్డి పార్టీ అభివృద్ధి కోసం పీఏసీ మెంబర్ తోట త్రిమూర్తులు వంటి సీనియర్ నాయకుల సలహాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని పనిచేస్తామని హామీ ఇచ్చారు. పిఎసి సభ్యునిగా ఎంపికైన సందర్భంగా త్రిమూర్తులును సత్కరించారు.

జిల్లా అధ్యక్ష హోదాలో మండపేట చేరుకున్న జగ్గిరెడ్డికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు.మండపేట నియోజకవర్గం క్యాడర్ సమక్షంలో జగ్గిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి కార్యాలయానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన తోట, జగ్గిరెడ్డిలు పార్టీ బలోపేతం కోసం జిల్లా నాయకత్వం, స్థానిక క్యాడర్ కలిసి పనిచేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయడంలో ఎల్లప్పుడు అందుబాటులో ఉండే త్రిమూర్తులుతో పాటు జిల్లా నుండి జగ్గారెడ్డి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాజబాబు, కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మిడివరం బాపిరాజు, అలీఖాన్ బాబా, పలివెల సుధాకర్, మారిశెట్టి సత్యనారాయణ, నీలం దుర్గా, పెంకే వెంకట్రావు, జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఎంపీపీలు ఉండమట్ల వాసు, నౌడు వెంకటరమణ, ఏఎంసి మాజీ చైర్మన్ నక్కా సింహాచలం, మట్టపర్తి గోవిందరాజు, కుడిపూడి రాంబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's work together to

You cannot copy content of this page

Scroll to Top