WhatsApp Image 2024 08 13 at 10.17.58
MLA KR Nagaraju distributed the CMRF cheques
హనుమకొండ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) 9 మంది లబ్ధిదారులకు సుమారు 4 లక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్య శ్రీ లో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు.ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, సీనియర్ నాయకులు సౌరం అభిలాష్ , చిన్ని, పస్తం శంకర్, పత్రి రాజేష్, యూత్ నాయకులు సౌరం టోని, గంధం సారంగపాణి మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
