నిరూపించ లేకపోతే నీ పదవికి రాజీనామా చేస్తావా అంటూ అనపర్తి ఎమ్మెల్యే సొల్లు రామకృష్ణారెడ్డి కి ఛాలెంజ్ విసిరిన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు…
అనపర్తి: త్రినేత్రం న్యూస్. రాజానగరం మండలంలో ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి తాను ఆన్లైన్ చేయించుకున్నట్టు దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయనున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తీవ్రంగా స్పందించారు.
నాపై చేసిన ఆరోపణ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించక లేకపోతే నీ పదవికి రాజీనామా చేస్తావా అంటూ అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చెల్లిబోయిన వేణు ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ కు బలహీనవర్గాల ప్రతినిధిగా వేణుగోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నాడని దీనికి అనపర్తి ఎమ్మెల్యే సిద్ధమా అంటూ వేణు ప్రశ్నించారు. ఈ విషయంపై కలెక్టర్ కి అనపర్తి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తాననడం కాదని అవసరమైతే కలెక్టర్ వద్దకు ఇద్దరం వెళ్దాం అంటూ వేణు పేర్కొన్నారు.
అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలం దోమాడ గ్రామంలో అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,పై కూటమి మూకలు దాడికి పాల్పడడానికి యత్నించిన సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి,కి సంఘీభావం తెలియచేయడంతో పాటు, ఈ విషయంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నాయకత్వంలో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ తానేటి వనిత, రాష్ట్ర పార్టీ యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, కొవ్వూరు నియోజకవర్గం వైకాపా ఇంఛార్జ్ తలారి వెంకట్రావు తదితర జిల్లా పార్టీ నాయకులు శుక్రవారం అనపర్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,పై యత్నించిన దాడి ఘటనపై సీనియర్ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, తన అనపర్తి వస్తానని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపిస్తానని పేర్కొన్నట్లు జిల్లా అధ్యక్షులు వేణు చెప్పారు.
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, స్పందించారని ఈ విషయంపై రాష్ట్ర నాయకత్వం తగు విధమైన కార్యాచరణతో ముందుకు రావడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు వేణు ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త వెనక ఒక బలమైన శక్తి జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో రంగంపేట జడ్పీటీసీ సభ్యుడు లంక చంద్రన్న, జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి తాడి సూరారెడ్డి, బిక్కవోలు మండల పార్టీ కన్వీనర్ పోతుల ప్రసాదరెడ్డి, నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కొండేటి భీమేశ్వర స్వామి, పందలపాక గ్రామ కమిటీ కన్వీనర్ సత్తి హరి ప్రసాదరెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లభశెట్టి సతీష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున అనపర్తి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


