తేదీ : 22/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, అదేవిధంగా ప్రయోజనాలకు ప్రాధాన్యతమిస్తుందని, అన్నారు. వర్షాల వల్ల నియోజకవర్గంలో ఒక్క ఎకరం పంట కూడా మునగనివ్వను అని స్పష్టం చేశారు. రూరల్ మండలం , సిద్ధాంతం గ్రామంలో పాలకోడు డ్రెయిన్ లో పూడిక తీత పనులను పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఆయన స్వయంగా ప్రోక్లైన్ నడుపుతూ పూడికను తొలగించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పెండింగ్ లో ఉన్న ఇతర డ్రోన్ల లో పూడిక తీత పనులను త్వరగ తిన పంపించాలని అధికారులకు ఫోన్ చేసి సూచించారు.
ఈ సందర్భంగా గత ఐదేళ్ల పాలన వ్యవస్థ సర్వ నాశనం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీను నెరవేరుస్తానని చెప్పారు. కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేసేలా నీటి సంఘాలు స్థానిక రైతులతో కలిసి పర్యవేక్షిస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ఏపియన్ డబ్ల్యు చైర్మన్రావి. వెంకటేశ్వరావు, డ్రైనేజీ డిఇ గణపతి, ఏఈ కుమార్ , టిడిపి నాయకులు, చేకూరు జగన్, మోహన్ రావు, కూటమి పార్టీల నీటి సంఘం డి సి లు మలిపెద్ది. సుబ్రమణ్యం, ఆంజనేయులు, బి. శివప్రసాద్, నాగ వెంకటేశ్వరరావు, అడుసిమిల్లి శివ రాజేష్, పెద్ది బోయిన. రాజు, బుర్ర .నాగేశ్వరరావు, చలసాని. శ్రీధర్, చి. వంశీకృష్ణ, ఎ. స్వరూప్, మేక. వెంకటేశ్వరరావు, అనిల్ , శివ నారాయణ, యం. వీర్రాజు, కాశీయా , విజయ్ పలువురు రైతులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


