MLA Adireddy : ఎమ్మెల్యే ఆదిరెడ్డిని కలిసిన రేషన్‌ షాపు డీలర్లు

TRINETHRAM NEWS

రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రేషన్‌ షాపు డీలర్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను తిలక్‌ రోడ్డులోని వారి కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎండియు వ్యవస్థను రద్దు చేస్తూ రేషన్‌ షాపు డీలర్ల ద్వారానే రేషన్‌ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రేషన్‌ డీలర్ల సమస్య పరిష్కారం కోసం వారి విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, మంత్రి నారా లోకేష్‌ దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించినందుకు గాను ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

రేషన్‌ డీలర్లు చేసిన ఉద్యమంలో వారి వెన్నంటే ఉన్న ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు. రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు జామి కృష్ణ, రాజమహేంద్రవరం అధ్యక్షుడు నమ్మి వెంకటేశ్వరరావు, సెక్రటరీ రమేష్‌, కోశాధికారి ఆదిరాజు, జాయింట్‌ సెక్రెటరీ శ్రీను, సీనియర్‌ డీలర్లు తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ration shop dealers met

You cannot copy content of this page

Scroll to Top