తేదీ : 04/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడ నియోజకవర్గం లో ప్రజలందరిపై వీరబ్రహ్మేంద్రస్వామి వారి కరుణ కటక్షాలు ఉండాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. శ్రీనివాస సెంటర్లో జరుగుతున్న స్వామి యాభై నాలుగవ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా దేవరకొండ నాకన్నా సత్రం ప్రాంగణంలో నిర్వహించిన వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందచేయగా, ఉత్సవ కమిటీ పెద్దలు రాముకు గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ పెద్దలు కోటా. నూకరాజు, పులపర్తి. ఆనంద్. దుర్గా చారి, నారాయణ, పెదపాటి. రవి , దుర్గాప్రసాద్, ముండూ రి. ప్రసాద్. ఆర్యవైశ్య కార్పొరేషన్ దర్శకులు, గోకవరపు. సునీల్, దేవరపల్లి కోటి, పెద్ద సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


