TRINETHRAM NEWS

రేపే హోలీ.. సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు..

Trinethram News : హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలెర్ట్ ప్రకటించారు. హోలీ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఈ మేరకు సీపీ అవినాష్ మహంతి హెచ్చరికలు జారీ చేశారు.

హోలీ పేరుతో.. రోడ్డు మీద వెళ్లే సంబంధంలేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. అంతేకాదు.. రోడ్లపై గుంపులు గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని కూడా సూచించారు. మద్యం సేవించి రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసినా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. పండుగ రోజున నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hyderabad police warning