స్త్రీ నిధి రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలి

TRINETHRAM NEWS

పెద్దపల్లి, మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. స్త్రీ నిధి బకాయిలను పూర్తిగా చెల్లించాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ అన్నారు గురువారం అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ లో మెప్మాలోని స్త్రీ నిధి లో అత్యల్ప ప్రగతి కలిగిన రిసోర్స్ పర్సన్ ను సమీక్ష నిర్వహించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ మాట్లాడుతూ స్త్రీ నిధి బకాయిలను వెంటనే కట్టించాలని, ఈ ఆర్థిక సంవత్సరం ప్రతి పట్టణ / స్లం సమాఖ్యలు 100% రికవరీ సాధించాలని అదనపు కలెక్టర్ సూచించారు స్త్రీ నిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా బోలోపేతం కావాలని తెలిపారు.

అత్యధిక వడ్డీ రేట్లు ఉండే మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్దకు మహిళలు వెళ్లకుండా మహిళా సంఘాల ద్వారా స్త్రీ నిధి లోనే రుణాలు అందించాలని తెలిపారు మహిళా సమాఖ్యలలో దీర్ఘకాలంగా బకాయిలు ఉన్న కమ్యూనిటీ ఆర్గనైజర్స్, రిసోర్స్ పర్సన్ లను సమీక్ష చేసి బకాయిలు పూర్తిగా కట్టించాలని అన్నారు. సమీక్షకు హాజరు కాని రిసోర్స్ పర్సెన్స్ పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు రికవరీలలో అవకతవకలు జరిగితే క్రిమినల్ కేసులు పెట్టాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు ప్రతి ఒక్క సమాఖ్య, రిసోర్స్ పర్సన్ వారి బకాయిలను పూర్తిగా చెల్లించి స్త్రీ నిధి రుణాలు వినియోగించుకునేలా రుణ ప్రణాళికను తయారు చేసుకోవాలని అన్నారు ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్ బాకీ పడిన సభ్యురాలని సందర్శించి నోటీసులు ఇచ్చి రోజువారిగా రికవరీ వివరాలను రిపోర్ట్ చేయాలని అన్నారు.

మహిళా శక్తిలో భాగంగా లోన్ బీమా ప్రమాద బీమాలలో నమోదైన క్లేయిమ్ లను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు మహిళా శక్తిలో భాగంగా కొత్త యూనిట్ లను నెలకొల్పాలని అన్నారు. సంఘాలలో లేని సభ్యులను సంఘాలలో చేర్చి కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం మహిళా సంఘాలలో చేరే వారి వయసు సడలించిందని ప్రస్తుతం 15 నుంచి 65 సంవత్సరాల వరకు మహిళ సంఘాలు చేరవచ్చని అన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, స్త్రీ నిధి రీజనల్ మేనేజర్లు, రిసోర్స్ పర్సన్స్ , తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Women's fund loans

You cannot copy content of this page

Scroll to Top