తేదీ : 24/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మచిలీపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తక్షణమే డీఎస్పీని నియమించి ట్రాఫిక్ ను నియంత్రణ చేయాలని జిల్లా కేంద్రమైన మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు య.ల్. బాలాజీ డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజు మచిలీపట్నంలో ముఖ్యంగా కోనేరు సెంటరు నుండి చుట్టు పక్కల బెల్లం కొట్ల నందు జగన్నాధపురం లో లారీలు, మినీ వ్యాన్లు, ఆటోలు విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ట్రాఫిక్ పోలీసులు బచ్చుపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద చలానాలు రాసేటటువంటి ఉత్సాహం నియంత్రణలో పూర్తిగా కోల్పోయారని అన్నారు.
పోర్టు రోడ్డు లో రాధిక థియేటర్ వద్ద ఆటోలు , బైకులు కూడా పార్కింగ్ చేస్తున్న నియంత్రణ చేయడంలో పూర్తిగా వైపల్యం చెందారని బాలాజీ అన్నారు. మూడు స్తంభాల సెంటర్ వద్ద, ప్లై ఓవర్ పట్టణం ఉన్న సర్వీస్ రోడ్లు లో లారీలు, టైర్ షాపులు , అక్రమణాలతో నిండిపోయిందని కనీసం ట్రాఫిక్ పోలీసులు కన్నెత్తి చూడకపోవడం విచారకరమని బాలాజీ అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించకపోవడం ఎంతవరకు సమంజసమని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తక్షణమే ట్రాఫిక్ నియంత్రణ చేయాలని నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత పోలీసులపై ఉందని , బందరు పౌర్టికి వస్తున్న లారీలు, పెద్ద పెద్ద బండ రాళ్లతో వస్తూ ఏ విధమైన భద్రత లేకుండా ప్రజల పాణాలు ముప్పు కలిగే విధంగా వస్తున్నాయని తెలియజేయడం జరిగింది. ఆటోలకు , కార్లకు, ట్రూ వీలర్స్ కు పార్కింగ్ స్థలాలు, ఏర్పాటు చేయాలని , ఎంత విశాలమైన మున్సిపల్ కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉందని దానిని పార్కింగ్ కోసం ఉపయోగించాలని బాలాజీ సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


