జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ, జూలై 31 (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లా అరకువేలి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నేచర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా ప్రమాదకరతపై విద్యార్థులకు నిపుణులు వివరించారు. 2024 నివేదిక ప్రకారం బాధితుల్లో 61% మంది మహిళలు, బాలికలేనని, వారిలో 90% మంది లైంగిక దోపిడికి గురవుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ దురాచారానికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, జిల్లా స్థాయిలో డిఎల్ఎస్ఎ, పోలీస్, లేబర్, విద్యా శాఖలు, మహిళా శిశు సంక్షేమ శాఖలు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సరస్వతి, నేచర్ ప్రతినిధులు టి.సంతోష్ కుమార్, బి.కృష్ణబాబు, సునీల్ అద్దు, కొండప్పా, మొస్య, నగేష్, పద్మ, శైలజ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Human trafficking is an

You cannot copy content of this page