అల్లూరి జిల్లా, అరకులోయ అక్టోబర్ 31, (త్రినేత్రం న్యూస్) : మొంథా తుఫాన్ ప్రభావంతో గత 28, 29, 30 తేదీల్లో కురిసిన అతి భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా అరకువ్యాలీ మండలం మాదల పంచాయతీ పరిధిలోని దాబుగుడ గ్రామంలో గూబయి అర్జున్ (w/o గూబయి రాధ) ఇంటిపై రేకు ఎగిరి పడటంతో మట్టి గోడ తడిసి, గోడ కూలిపోయింది.
అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే గోడ కూలడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్రామస్థులు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


