చినుకు పడితే చిత్తడే , గుంతల మయంగా రోడ్డు. పాదాచారులు వాహనదారులు, రైతులకు తీవ్ర ఇబ్బంది.
బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ; ఓర్సు ముత్యాలు.
డిండి(గుండ్లపల్లి) అక్టోబర్ 30 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని వావిల్కొల్ ( వడ్డేరగూడెం) నుండి బ్రాహ్మనపల్లి బీ టీ రోడ్డ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు అధికారులను కోరారు. ఇప్పటికే ఈ రోడ్డు గుండా వాహనాదారులు ప్రజలు ప్రయాణికులు రైతులు ప్రయాణం చేయాలంటే చాలా అవస్థలు పడుతున్నారని తెలిపారు. కంకర డస్ట్ పోసి అలాగే వదిలేసారని బీటి వేయడం మర్చిపోయారని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంకర తేలి రోడ్డు మొత్తం గుంతల మయంగా బురదా నీటితో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని , చినుకు రాలితే చిత్తడే అన్నట్లు ఈ రోడ్డు వెంబడి ప్రయాణం చేయాలంటే వాహనదారులు పాదాచారు లు , రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వడ్డెర గూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


