త్రినేత్రం న్యూస్. స్థానిక సంస్థలలో బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు, ప్రశాంతంగా నిరసనగా ఈనెల 18న శనివారం రాష్ట్ర బంద్ జరపాలని, ఈ బందుకు స్వచ్ఛందంగా కాలేజీలు, స్కూల్స్, బస్సులు, షాప్స్ అందరూ సమాఖ్యంగా సహకరించాలని ఈ బంధు, బంద్ ఫర్ జస్టిస్ అని బి ఆర్ కృష్ణ ముదిరాజ్ యావత్తు తెలంగాణ ప్రజానీకానికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం. భారతదేశ చరిత్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడం జరగలేదు. మొదటిసారి న్యాయ చరిత్రలో ఇలా బీసీలపై అన్యాయంగా స్టే ఇచ్చారు.. నోటిఫికేషన్ వేలాదిమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు ఎలా స్టై ఇస్తారు.
కేసు నాలుగు రోజులుగా కోర్టులో నడుస్తుంది ఇస్తే మొదటి రోజే ఇవ్వాలి, కానీ రెండుసార్లు స్టే ఇవ్వబోమని కోర్టు ఇవ్వడానికి నిరాకరించింది. నోటిఫికేషన్ ఇచిన తరువాత స్టే ఇచ్చారు ఇది అత్యంత బాధాకరమైన విషయం,రిజర్వేషన్ల కేసులో 30 బీసీ సంఘాలు ఇంప్లీడ్ కేసులు వేశారు పిటిషనర్ల వాదన కూడా వినకుండా స్టే ఎలా ఇస్తారని ఇది బీసీల దురదృష్టమని ప్రభుత్వాల నిర్లక్ష్ణమని ఆయన అభిప్రాయపడ్డాడు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సందర్భంగా 50% సీలింగ్ ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సమయం – సందర్భాన్ని బట్టి 50 శాతం సడలించాలని ఆదేశాలు యున్నవి. అగ్రకులాలకు రిజర్వేషన్లపై ఈ కేసు సందర్భంగా 50% సీలింగ్ ఎత్తివేసారు. బీసీ కేసు సందర్భంగా ఎత్తివేయడానికి అభ్యంతరం ఏమిటి రాజకీయ రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ కు అర్ధం హేతుబద్ధత లేదు. ఎందుకంటే విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు మెరిట్” దెబ్బ తింటుందని చేసే వాదనకు కొంతవరకు హేతు బద్దత న్యాయం యుంది. మండల్ కమిషన్ కేసులో కూడా రాజకీయ, విద్య, ఉద్యోగాలకు మెరిట్” యుంటుందని 50 శాతం సీలింగ్ ప్రస్తావన యుంది. చదువు రాని వారు కూడా ఎన్నికలలో పోటీ చేస్తారు. అలాంటప్పుడు ఈ రాజకీయ రిజర్వేషన్లకు 50 శాతం నిబంధనకు ఎలాంటి హేతుబద్ధమైన కారణం లేదు. ఇది పూర్తి అసంబద్ధమైనది.
బీసీ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా ఒప్పుకోము . అని ఆయన కడాకండిగా చెప్పినారు. రిజర్వేషన్లు 20 శాతం కు తగ్గించి ఎన్నికలకు పోతే, బీసీలు యుద్ధం చేయవలసి వస్తుందని,ఆ పరిస్థితి ప్రభుత్వం తీసుకురావద్దని, మరియు,ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని హెచ్చరించారు. పార్టీ పరం ఇస్తే బీసీలకు అన్యాయం జరుగుతది బీసీలకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే , కాబట్టి, 42 శాతాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి 9 నైన్త్ షెడ్యూల్లో పెట్టి తమిళనాడు రాష్ట్రం మాదిరిగా రాజ్యాంగ భద్రత కల్పించండి. తెలంగాణ బీసీలకు రాజకీయ రాజ్యాంగ రక్షణ కల్పించాలని బి ఆర్ కృష్ణ ముదిరాజ్ ప్రభుత్వానికి సూచన చేసినారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


