High Court : BC రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు (Telangana BC Reservations) రిజర్వేషన్ల అంశంపై నేడు హైకోర్టులో(Telangana High Court) విచారణ ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే విషయమై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మంగళవారం మంత్రులు, న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. అయితే, వాస్తవానికి ఇవాళ ఉదయం 10.30కి విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. న్యాయమూర్తుల ఎదుట బీసీ రిజర్వేషన్ పిటిషన్‌ను న్యాయవాదులు మెన్షన్ చేశారు. సుప్రీంకోర్టులో ఏం జరిగిందని హైకోర్టు ధర్మాసనం వారిని ప్రశ్నించింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై విచారణకు మధ్యాహ్నం 12.30కి వాయిదా వేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BC reservations in the High Court postponed

You cannot copy content of this page

Scroll to Top