త్రినేత్రం న్యూస్, ఆలమూరు, ఆగస్టు.29. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి చెందిన కొండమంచిలి హరీష్ కుమార్ ని నియమించారు.ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన హరీష్ వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుడిగా ఉన్నారు. తనకు ఈ పదవ రావడానికి సహకరించిన జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ కోసం పాటుపడతారని ఈ సందర్భంగా హరీష్ కుమార్ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


