Child Marriage : బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం

TRINETHRAM NEWS

అనపర్తి జూనియర్ సివిల్ కోర్ట్
న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న,

త్రినేత్రం న్యూస్. అనపర్తి: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అనపర్తి జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న అన్నారు. అనపర్తి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు . బాల్య వివాహం చేస్తున్న తల్లిదండ్రులపై, క్రతువు నిర్వహిస్తున్న అర్చకులపై, వివాహానికి హాజరైన బంధువులపై కూడా కేసులు నమోదవుతాయన్నారు. బాల్య వివాహం చేసిన.. చేసుకున్న.. ప్రోత్సహించిన రెండేళ్ల జైలు శిక్ష , రూ .లక్ష జరిమానా అనే విషయాలను తల్లిదండ్రులకు చెప్పి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీను నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి , న్యాయవాదులు రమణ మూర్తి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Child marriage is a crime

You cannot copy content of this page

Scroll to Top