
తేదీ : 28/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గోపాలపురం నియోజకవర్గం, ద్వారకాతిరుమల మండలం, గ్రామంలో ఉన్నటువంటి నేలటూరి .సత్యనారాయణ, దమయంతి. మంచి మనసు కలిగి ఉన్న పుణ్య దంపతులు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో పురోహితం చేసుకుంటూ , మరోవైపు దర్జీగా పనిచేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా గౌరవ సంప్రదాయాలను పాటిస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక కుమార్తె.
ముగ్గురికి పెళ్లిళ్లు చేసినారు ఎటు వంటి కష్టనష్టాలు లేకున్నా , సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నారు. మనవళ్లు మనవరాలతో ఇల్లంత ప్రతిరోజు సందడిగా ఉంటుంది. బంధువులను, శ్రేయోభిలాషు లను, స్నేహితులను ప్రతి ఒక్కరీని కూడా ఆప్యాయతతో పలకరించడం, వారి ఇంటికి వెళ్ళిన వాళ్లకు ఎటు వంటి లోటుపోట్లు లేకుండా చూసుకోవడం జరుగుతుంది.
శ్రద్ధగా, నైపుణ్యంతో వస్త్రాలను అద్భుతంగా తీర్చిదిద్దే దర్జీలకు గౌరవం అర్పిద్దామని ప్రపంచ దర్జీల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో సిరిసంపదలు కలిగి, సుఖ సంతోషాలతో ఉండాలని, ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉండాలని, చల్లగా జీవించాలని, మనస్పూర్తిగా దేవుణ్ణి కోరి ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
