Vanthala Devadasu : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పి.వి.ఎన్ మాధవ్ ఎన్నికపై హర్షం. వంతల దేవదాసు అభినందనలు

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా: త్రినేత్రం న్యూస్ జూలై 2 : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పి.వి.ఎన్ మాధవ్ ఎన్నికవ్వడం పట్ల జిల్లా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు, సాగర పంచాయతీ ఎంపీటీసీ వంతల దేవదాసు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వంతల దేవదాసు మాట్లాడుతూ, పి.వి.ఎన్ మాధవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయం పట్ల అభిరుచి కలిగి ఉన్నవారని, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో విద్యార్థి నాయకుడిగా, ఆపై బీజేపీ యువమోర్చాలో రాష్ట్రస్థాయిలో పలు ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారిగా గుర్తు చేశారు. అనంతరం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేసి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారని వివరించారు.
కార్యకర్తలకు దగ్గరగా ఉండే శైలితో ఆయన బీజేపీలో విశేషమైన గుర్తింపు పొందారని వంతల దేవదాసు తెలిపారు. మాధవ్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రస్తుతం కూటమిలో భాగమైన ఇతర పార్టీలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy to see P.V.N. Madhav

You cannot copy content of this page

Scroll to Top