బాలానగర్ ఏసీపీ పింగళి నరేష్ రెడ్డి ని సన్మానించిన హెచ్.ఎ.ల్ యూనియన్ నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 16 : సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని బాలానగర్ ఏసీపీ పింగళి నరేష్ రెడ్డి కి జాతీయ స్థాయి లో భారత ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ ను నిన్న గోల్కొండ కోట లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న సందర్బంగా ఈ రోజు హెచ్.ఎ.ల్ గుర్తింపు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్.టి.యు.సి అధ్యక్షులు కర్కనాగరాజు ఆధ్వర్యంలో ఏసీపీ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఫూల భోకే తో శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తన పై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎస్.ఐ నుండి ఏసీపీ వరకు అనేక హోదాలో అనేక ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో శాంతి భద్రతల కాపాడటం విషయం లో వెనకడుగు వేయలేదు అని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో హెచ్.ఎ.డబ్యూ యూనియన్ ఉపాధ్యక్షులు కుతాడి కృష్ణా,జాయింట్ సెక్రెటరీస్ డి. వెంకటపతి, నాగార్జున, వెంకటేష్, అబ్దుస్ షుకూర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

H.L. Union leaders felicitate Balanagar ACP

You cannot copy content of this page

Scroll to Top