మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గ సభ్యులు.
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 16 : సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని బాలానగర్ ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డికి జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ ను ఆగస్ట్ 15 రోజు గోల్కొండ కోటలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న సందర్బంగా శనివారం రోజు కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి,పూల మొక్కని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తనపై మరింత బాధ్యత పెరిగిందని ఆయన మాట్లాడారు.ఎస్.ఐ నుండి ఏసీపీ వరకు అనేక హోదాలో అనేక ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో శాంతి భద్రతల కాపాడటం విషయంలో వెనకడుగు వేయలేదని అన్నారు.అలాగే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, సభ్యులు యస్.రవికుమార్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


