త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 18 :నెల్లూరు జిల్లా : కావలి పట్టణంలో ఇంటింటికి తాగునీరు అందించే దిశగా మున్సిపాలిటీ చర్యలు వేగవంతం చేసింది. ఇంటింటికి తాగునీటి నీరు అందిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కావలి పట్టణంలోని 9వ వార్డులో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ముందుగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదేశాలతో పట్టణంలో ఇంటింటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 9వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులు నుంచి రూ.70 లక్షల వ్యయంతో పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. పట్టణంలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మార్చి నెలలోపు పైప్‌లైన్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ పనులు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు కిషోర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతానికి పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.నీటి ఎద్దడి లేకుండా చేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని పేర్కొన్నారు.కావలి పట్టణ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇచ్చిన హామీలను ఏడాది లోపే నెరవేరుస్తున్నారని తెలిపారు.
గత పాలనలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం సమస్యను పూర్తిగా పరిష్కరించే దిశగా పనులు జరుగుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


