Comrade Shekhar Reddy : ప్రజా పోరాట వేగుచుక్క కామ్రేడ్ శేఖర్ రెడ్డి

TRINETHRAM NEWS

శేఖర్ రెడ్డి జీవితం స్ఫూర్తి దాయకం…
చివరి శ్వాస వరకు పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసిన మెరుగని కమ్యూనిస్టు కామ్రేడ్ శేఖర్ రెడ్డి.
40వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సిపిఐ నాయకులు.

డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 18 , త్రినేత్రం న్యూస్. ప్రజా పోరాటపు వేగుచుక్కగా కార్మిక కర్షక పోరాటాల వెలుగు రేఖగా తన చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీ కోసం ప్రజల కోసం పాటుపడిన విరామమెరగని కమ్యూనిస్టు కామ్రేడ్ తిప్పర్తి శేఖర్ రెడ్డి సేవలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని సిపిఐ డిండి మండల సహాయ కార్యదర్శి,ఖానాపూర్ మాజీ సర్పంచ్ తిప్పర్తి విజేందర్ రెడ్డి అన్నారు.
బుధవారం అమరజీవి కామ్రేడ్ తిప్పర్తి శేఖర్ రెడ్డి 40వ, వర్ధంతి సందర్భంగా ఖానాపూర్ గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో ఎర్రజెండాలు చేతబట్టి డప్పు చప్పులతో కామ్రేడ్ శేఖర్ రెడ్డి స్మారక స్థూపం వద్దకు ర్యాలీగా చేరి స్తూపం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి శేఖర్ రెడ్డి స్మారక స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన కుమారుడు,సిపిఐ మండల సహయ కార్యదర్శి,ఖానాపూర్ మాజీ సర్పంచ్ తిప్పర్తి విజేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం,కార్మిక కర్షకుల కోసం దేవరకొండ నియోజకవర్గం లో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే పోరాటాల్లో మొదటి వరుసలో ఉండి ఉద్యమంలో అగ్రభాగాన నిలిచేవారని కామ్రేడ్ శేఖర్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి తన చివరి శ్వాస వరకు పనిచేస్తూ ప్రజల కోసం పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.

దేవరకొండ తాలూకా యువజన కార్యదర్శిగా పనిచేసి నియోజకవర్గంలో యువజన సంఘాన్ని బలోపేతం చేశారని, ఖానాపూర్ సర్పంచిగా గ్రామ అభివృద్ధి తో పాటు పార్టీ బలోపేతానికి కార్యకర్తల సంక్షేమానికి పాటు పడ్డారని, మండలాలు ఏర్పాటు అయ్యాక మొదటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిండి మండల కార్యదర్శిగా ఎన్నికయ్యారని,డిండి ఆయకట్టు దారుల ప్రధాన కార్యదర్శిగా,రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజాసంఘాల బలోపేతం కోసం విరామ మెరుగని కమ్యూనిస్టుగా ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని ఆయన జీవితం నేటి తరానికి,యువతకు,పార్టీ నాయకత్వానికి ఆదర్శప్రాయమని అన్నారు.

ఆయన చనిపోయి 40 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజల్లో ఆయన చేసిన పోరాటాలు, కార్యక్రమాలు ప్రజలు మాట్లాడుకోవడం, చర్చించుకోవడం గర్వించదగ్గ విషయమని విజేందర్ రెడ్డి కొనియాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Comrade Shekhar Reddy

You cannot copy content of this page

Scroll to Top