జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని డిండి మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రత్యేక చోరవ తో ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది.
ప్రతి ఏడాది వేసవి కాలంలో నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొనే గ్రామాలకు తాగునీటి సౌకర్యం అందించేందుకు ఎమ్మెల్యే పంచాయతీ అధికారులతో చర్చించి ప్రత్యేక నిధులను మంజూరు చేయించారు.
ఈ నిధులతో కొత్త మోటార్లను కొనుగోలు చేసి వేసవిలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడానికి చర్యలు చేపడతారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ముఖ్యం తాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అవసరమైన చోట కొత్త బోర్లు వేయించి, నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడిగిన వెంటనే ఇంతటి సహాయాన్ని అందించినందుకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

solve drinking water problem

You cannot copy content of this page