
Grand Handicrafts Festival : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్: జూలై 07; జిల్లా కేంద్రమైన విజయవాడ అంబేద్కర్ కళావేదికలో ఏపీ హస్త కళా మహోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఆ కార్యక్రమంలో పార్లమెంటు ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. కొండపల్లి బొమ్మల విశిష్టతను బ్రాండింగ్ను సైతం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన పవన్ ను కోరారు.
అయితే ఆ వేదికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అన్నిటిని డిప్యూటీ సీఎం పవన్ మరియు మంత్రి సవిత, ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హస్తకళ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పలువురు ఉన్నతాధికారులు కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి హస్తకళ మహోత్సవం హస్తకళ ఎక్స్పో అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ప్రారంభించుకోవడం మంచి పరిణామం అని తెలిపారు లేపాక్షి అనేది ఒక సంస్థ మాత్రమే కాదు అది ఆంధ్రప్రదేశ్ హస్తకళల వారసత్వం సంస్కృతి సాంప్రదాయం కళాకారుల సృజనాత్మక ప్రతీకాని ఎంపీ చిన్ని తెలిపారు రాష్ట్రంలో వేలాదిమంది హస్తకళాకారుల జీవనోపాధికి బలమైన ఆధారంగా నిలుస్తున్న లేపాక్షిని ప్రపంచ స్థాయిలో మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు సంప్రదాయ హస్తకళలను పరిరక్షిస్తూనే ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు ఈ కూటమి ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు
హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం లేపాక్షి బ్రాండ్ మరింత బలోపేతం చేయడం ఈ కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు విస్తరించడం లక్ష్యంగా కార్యచరణ కొనసాగుతుందని తెలియజేశారు.హస్తకళలను కళాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా వారికి ప్రోత్సాహం అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు భవిష్యత్తులో కళాకారులకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ చిన్ని తెలియజేశారు. కొండపల్లి హస్తకళల భౌగోళిక గుర్తింపును కాపాడుతూ నకిలీల నివారణ మరియు అంతర్జాతీయ మార్కెటింగ్ కు అణువుగా వీటికి పార్లమెంట్ వేదికగా చర్చించి జియో టాకింగ్ సౌకర్యాన్ని సైతం తీసుకురావడం జరిగిందని ఎంపీ చిన్ని గుర్తు చేశారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి సవిత ఎంపీ కేశినేని చిన్ని , రాష్ట్ర హస్తకళ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పలువురు ఐఏఎస్ లు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe