త్రినేత్రం న్యూస్.. అమలాపురం.. కూటమి పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆదేశాలలో భాగంగా అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆనందరావు, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులు ఎమ్మెల్యే, స్వీకరించారు. 540 వినతులు వచ్చినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, అమలాపురం పట్టణ టిడిపి అధ్యక్షులు నేతాజీ, అమలాపురం రూరల్ మండల టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, పెచ్చెట్టి విజయలక్ష్మి, కర్రి రామస్వామి, దిన్ష బాబు, పచ్చిమాల ఏడుకొండలు, దేవరపల్లి వీరేష్ కుమార్, మాడ మాధవి, అబ్బాయి వెంకన్న, మాకిరెడ్డి పూర్ణిమ, గెల్లా మీనాకుమారి, బొర్రా ఈశ్వరరావు, పెద్దిరెడ్డి రాము మరియు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


