Heavy Rains : ఏపీలోని జిల్లాల్లో భారీ వర్షాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రజలు బిగ్ అలర్ట్. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy rains in districts

You cannot copy content of this page

Scroll to Top