ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
YCP Expresses Outrage

కూటమి ప్రభుత్వంపై విద్యార్థుల సమరభేరి!

“విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం” — వైసీపీ తీవ్ర ఆగ్రహం

విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలి
డీఎస్సీ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి వెంటనే అమలు చేయాలి

YCP Expresses Outrage : త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరిగిందని వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు,చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు, డీఎస్సీ అవకతవకలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
“విద్యార్థుల కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి” …ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కళాశాలల్లో ఫీజుల సమస్యల కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఈ పరిస్థితులతో మనస్తాపానికి గురై కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి… డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“హామీలు అమలు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం”… నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి… ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నాయకులు కోరారు. విద్యార్థుల సమస్యలపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాస్తవ పరిస్థితులను పరిశీలించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
“విద్యార్థుల భవిష్యత్తును కాపాడే వరకు పోరాటం ఆగదు!”… విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కూటమి ప్రభుత్వంపై విద్యార్థుల సమరభేరి!
“విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం” — వైసీపీ తీవ్ర ఆగ్రహం…
విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలి
డీఎస్సీ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి వెంటనే అమలు చేయాలి
రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరిగిందని వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు,చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు, డీఎస్సీ అవకతవకలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
“విద్యార్థుల కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి”… ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కళాశాలల్లో ఫీజుల సమస్యల కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఈ పరిస్థితులతో మనస్తాపానికి గురై కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి…. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“హామీలు అమలు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం”… నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి… ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నాయకులు కోరారు. విద్యార్థుల సమస్యలపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాస్తవ పరిస్థితులను పరిశీలించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
“విద్యార్థుల భవిష్యత్తును కాపాడే వరకు పోరాటం ఆగదు!”… విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page