ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Girajala Babu house arrest

మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళన

Girajala Babu House Arrest : త్రినేత్రం న్యూస్, కడియం, ఆగస్టు 10, సోమవారం: మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు అన్యాయం చేశారంటూ కూటమి ప్రభుత్వంపై నిరసనకు దిగేందుకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
మెగా డీఎస్సీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ రాజమండ్రి రూరల్ మాజీ సమన్వయకర్త, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబును ఆయన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
గిరజాల బాబుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కూడా పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page