Governance : ప్రజల వద్దకు పాలన

TRINETHRAM NEWS
Governance to the people

Governance : ఎన్టీఆర్ జిల్లా : మార్చి 31: (త్రినేత్రం న్యూస్); మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, ముచ్చెనపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ రాజా మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, భాష , పార్టీ బేధం లేకుండా సూపర్ సిక్స్ పథకాలు అందాయని అన్నారు.

అదేవిధంగా ఆ పంచాయతీలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారు తెలిపారు. డ్రైనేజీ, వీధి దీపాలు, నీటి సౌకర్యం, సీసీ రోడ్లు మొదలైన వాటి గురించి వివరణ అందించారు. నిరుపేదలకు ఇళ్ళు, డ్రైనేజీ సమస్య కొరత కొంచెం ఉందని ప్రభుత్వం గుర్తించి తక్షణమే వాటిని అమలు పరచాలని కోరారు.

ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎలక్షన్ లు జరిగిన కూటమి ప్రభుత్వం అనేది గెలుపని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top