
Census : త్రినేత్రం న్యూస్ : Mar 31, 2026, తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ మే నెల నుంచి ప్రారంభం కానుంది. ముందుగా ఇళ్ల సర్వే ఏపీలో మే 1 నుంచి 30 వరకు, తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏపీలో మే 16 నుంచి 30, తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 తేదీల మధ్య చేపట్టనున్నారు.
ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ప్రజలు తమ ఇళ్ల సమాచారాన్ని సెన్సస్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. ఇళ్ల సర్వేలో భాగంగా 34 ప్రశ్నలు అడగనున్నట్లు సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ మీడియా సమావేశంలో వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

