Trinethram News : శ్రీమల్లికార్జునస్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈవో వెల్లడి – రోజుకు 1,000 నుంచి 1,200 ఉచిత స్పర్శదర్శనం
భువిలో వెలసిన కైలాసం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి క్షేత్రంగా పేరొందింది. ఆలయంలోని అభిషేక సమయంలో భక్తులు లింగాన్ని తాకే అవకాశం ఉంది. ఇదే స్పర్శదర్శనంగా పేరొందింది.
శ్రీశైల మహాక్షేత్రంలో జులై ఒకటో తేదీ నుంచి శ్రీమల్లికార్జునస్వామి ‘ఉచిత స్పర్శ దర్శనాన్ని’ పునః ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ టోకెట్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు.
ప్రస్తుతానికి దేవస్థానం వద్ద టోకెన్లు జారీ చేస్తామని, తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానం ప్రవేశపెడతామని తెలిపారు. టోకెన్లలో భక్తుల పేరు, ఆధార్, ఫోన్ నంబర్, క్యూఆర్ కోడ్ ఉంటాయని చెప
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


